Clock Of Nellore ( Srihari Kota ) – భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ISRO ) మరో రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమైంది. చంద్రయాన్ – 3 ప్రయోగం పూర్తి చేసిన కేవలం 16 రోజుల్లోనే మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టి తన సత్తాను నిరూపించుకుంటుంది. ఈనెల 30వ తేదీనా ఉదయం 6:30 గంటలకు PSLV – C56 రాకెట్ ను ప్రయోగించనుంది. ఉమ్మడి నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇది పూర్తిగా వాణిజ్య ప్రయోగం. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన DS-SAR అనే 360 కిలోల ఉపగ్రహంతో పాటూ మరో 6 మైక్రో ఉపగ్రహాలను భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. సింగపూర్ కు చెందిన DS-SAR ఉప గ్రహం పూర్తిగా రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉప గ్రహం. దీంతో పాటూ సింగపూర్ కే చెందిన VELOX-AM అనే 23 కిలోల ఉపగ్రహం, ARCADE, SCOOB-II, NuLIoN, Galassia-2, ORB-12 STRIDER అనే ఉప గ్రహాలు కూడా అంతరిక్షంలోకి చేరనున్నాయి. రాకెట్ ప్రయోగానికి సంభందించి శనివారం కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. కౌంట్ డౌన్ అనంతరం 30వ తేదీనా ఉదయం 6:30 గంటలకు PSLV – C56 రాకెట్ షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి ఉప గ్రహాలను మోసుకుపోనుంది.
