నెల్లూరు జిజిహెచ్ లో మినరల్ వాటర్ ప్లాంట్స్ : ప్రారంభించిన ఎంపిలు వేమిరెడ్డి, ఆదాల

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు (GGH ) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే వారికి తాగునీరు అందించటం తన అదృష్టంగా భావిస్తున్నానని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు ఆర్వో వాటర్ ప్లాంట్లను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లోక్ సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి త్రాగునీరు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నానని, అలాగే జి జి హెచ్ లోని అన్ని త్రాగునీటి ప్లాంట్లను వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహణ ఖర్చులు భరిస్తామని అన్నారు. వి పి ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 110 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని, అంతే కాకుండా వాటిని సక్రమంగా మెయింటెనెన్స్ కూడా చేస్తున్నామన్నారు. గతంలో ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్, కోవిడ్ సమయంలో పది లీటర్ల కాన్సన్ట్రేటర్లు 100 ఇచ్చామన్నారు. జి జి హెచ్ లో ఆర్ఓ ప్లాంట్ అవసరమని జిల్లా కలెక్టర్ అడిగిన వెంటనే ఏర్పాటు చేయడానికి అంగీకరించనున్నారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. లోక్ సభ సభ్యులు ఆదాల ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ అడిగిన వెంటనే ఫౌండేషన్ ద్వారా అర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాన గుణం కలిగిన వ్యక్తిని అన్నారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో సమస్యల పరిష్కారానికి అందరం సంయుక్తంగా కృషి చేస్తున్నామన్నారు. వేయి పడకలు కలిగిన జి జి హెచ్ కి త్రాగునీటి కొరత ఉందని చెప్పిన వెంటనే స్పందించి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఓపి వద్ద 1000 లీటర్ల ఆర్వో ప్లాంట్, డయాలసిస్ యూనిట్ వద్ద నీటి అవసరం ఎక్కువగా ఉండటంతో అక్కడ మరో 1000 లీటర్ల ఆర్వో ప్లాంట్, మరో 2000 లీటర్ల ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరిండెంట్ డా.సిద్దా నాయక్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.జమున, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్ సునంద, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, చిరంజీవి రెడ్డి పలువురు వైద్యాధికారులు ఆసుపత్రి సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Read Previous

ఈనెల 30న PSLV – C56 రాకెట్ ప్రయోగం : షార్ లో సర్వం సిద్ధం

Read Next

నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం : పోటెత్తిన భక్త జనం

Leave a Reply

Your email address will not be published.