Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని పలు విభాగాలను మంగళవారం మేయర్ స్రవంతి తనిఖీ చేశారు. సిటీ ప్లానింగ్, ప్రజారోగ్య శాఖ, ఎస్టాబ్లిష్ మెంట్ విభాగాల్లోకి వెళ్లిన మేయర్ రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పనితీరుని అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లోని రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది హాజరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చే అర్జీలకు నిర్ధిష్ఠ గడువులోగా పరిష్కారం అందించే విధంగా అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ, నిబద్దత పాటించి నెల్లూరు కార్పొరేషన్ కు మంచి పేరు తీసుకురావాలని మేయర్ అధికారులు, సిబ్బందికి సూచించారు.
