Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తిరుమలేశ్వర్ రెడ్డిని నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. విజయ డైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఇతర నేతలతో కలిసి నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లిన ఆదాల ప్రభాకర్ రెడ్డి నూతన ఎస్పీని కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. ప్రజా ప్రతినిధులుగా తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎస్పీ ధన్యవాదాలు తెలియజేశారు.

Tags: Nellore MP Adala Prabhakar Reddy Nellore police Nellore Police Office Nellore SP Tirumaleswar Reddy