పంట కాలువలో పడి లారీ క్లీనర్ మృతి : కేసు నమోదు చేసిన పోలీసులు

Clock Of Nellore ( Naidupeta ) – తిరుపతి జిల్లా నాయుడుపేటలోని విన్నమాన పంట కాలువలో ఒ వ్యక్తి మృతదేహం పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. స్థానిక అమరా గార్డెన్ కు చెందిన లక్ష్మీ నారాయణగా గుర్తించారు. మృతుడు లారీ క్లీనర్ అని పోలీసులు వెల్లడించారు. స్వర్ణముఖి నది ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం సేవించి తర్వాత విన్నమాల పంట కాలువ కల్వర్టుపై కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Previous

టిడిపి కార్యకర్తలారా… మీరు కూడా ఆలోచించండి : విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే అనీల్

Read Next

నెల్లూరు నర్తకి సెంటర్ లో వ్యక్తి అనుమానస్పద మృతి

Leave a Reply

Your email address will not be published.