Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి నారాయణే మళ్లీ పోటీ చేయనున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో శుక్రవారం నాడు పలువురు నెల్లూరు నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలను చర్చించారు. అదే క్రమంలో ఓ నేత నెల్లూరు సీటీ నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరగా, సిటీ నియోజకవర్గం గురించి మాట్లాడవద్దు… అక్కడ మళ్లీ నారాయణే పోటీ చేస్తారు అని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. 2014 నుండి 2019 వరకూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తర్వాత 2019 జరిగిన ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేశారు. వైసీపి అభ్యర్ధి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ చేతిలో స్వల్వ ఓట్ల తేడాతో నారాయణ ఓటమి చెందారు. అప్పటి నుండి రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నారాయణ… 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహాలు లేవనెత్తాయి. తాజాగా దీనిపై చంద్రబాబు స్పష్టత ఇవ్వడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.