Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మంగళవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. పార్టీ కార్యక్రమాల కోసం నెల్లూరుకు విచ్చేసిన రుద్రరాజు సహచర నేతలైన ఏఐసిసి కార్యదర్శి మయప్పన్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆనం నివాసానికి వెళ్లారు. ఆనం రామ నారాయణరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. కుమారుడు, కోడలుతో కలిసి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై వారు చర్చించుకున్నారు.
