Clock Of Nellore ( Kuppam ) – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర.. జన ప్రభంజనంలా ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి శ్రేణులు పెద్దఎత్తున కుప్పానికి పోటెత్తారు. కార్యకర్త నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడి వరకూ యువనేతతో పాదం కలిపారు. ఆశయం నెరవేరాలి అంటూ బాలకృష్ణ భుజం తట్టి వెంట నడవగా, ప్రజల బాగోగులు తెలుసుకుంటూ పిడికిలి బిగించి విజయ సంకేతం చాటుతూ లోకేశ్ ముందుకు సాగారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ కుప్పంలో పాదయాత్ర నిర్వహించిన లోకేష్ తర్వాత కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
