గిరిజన సర్పంచ్ కు కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వరా ? – ప్రశ్నించిన పెంచలయ్య

Clock Of Nellore ( Nellore ) – గిరిజన మహిళా సర్పంచ్ కు కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వారా… అంత అన్యాయమా అని ప్రశ్నించారు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి. పెంచలయ్య. నెల్లూరులోని వెన్నలకంటి రాఘవయ్య భవన్ లో ఆయన గిరిజన మహిళా సర్పంచ్ కోమా కుమారితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లూరుజిల్లా ఆత్మకూరు మండలం, అప్పారావుపాళెం గిరిజన మహిళా సర్పంచ్ సోమా కుమారిని స్థానిక ఎంపిపి వేణుగోపాల్ రెడ్డి, ఎంపిడిఓ శ్రీనివాసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ కుర్చునేందుకు కనీసం కుర్చీ కూడా ఏర్పాటు చేయకుండా అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సర్పంచ్ సోమా కుమారి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎంపిపి వేణుగోపాల్ రెడ్డి, ఎంపిడిఓ శ్రీనివాసులు పేర్లను తప్పించి కేసు నమోదు చేశారన్నారు. యానాదుల సంక్షేమ సంఘం తరపున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సర్పంచ్ కు జరిగిన అవమానం, వేధింపులపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని, ఈ కేసులో ఎంపిపి, ఎంపిడిఓ పేర్లను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. లేని యెడల దీనిపై రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సర్పంచ్ సోమా కుమారి, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాకాని వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపూరు కృష్ణయ్య, పుత్తూరు శ్రీనివాసులు, చెంబేటి ఉష, ఇండ్ల రమ్య, రమేష్, సతీష్, వేణు పాల్గొన్నారు.

Read Previous

మాజీ మంత్రి అనీల్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఘనంగా కనుమ తెప్పోత్సవం

Read Next

పదవికి రాజీనామా చేసిన వవ్వేరు కో – ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మైన్ సూరా

Leave a Reply

Your email address will not be published.