స్పీడు పెంచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి : నిత్యం ప్రజల్తోనే !

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడు పెంచారు. అభివృద్ధి కార్యక్రమాలను మినహాయిస్తే రోజూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చినప్పటి నుండి ఆయన సూచనలతో నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలను రూపొందించి ఆ దిశగా ముందుకెళ్తున్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే తటస్థుల దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతాల వారీగా తటస్థులతో సమావేశమవుతూ తనుక మరో సారి మీ ఆశీస్సులు అందించాలని, మీ సమస్యలను నా సమస్యలు భావించి పనిచేస్తానని అభ్యర్ధిస్తున్నారు. తాజాగా బుధవారం 38వ డివిజన్ లోని ఎర్రకట్ట సంఘంలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. ప్రభుత్వ పథకాల గూర్చి వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాసరి అమృత, రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ షేక్ సైదాని తదితరులు పాల్గొన్నారు.

మరో వైపు గడప గడపకు కార్యక్రమం ముగిసిన వెంటనే 41వ డివిజన్ లోని పరమేశ్వరి నగర్ లో తటస్థుల దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా ఉండే రాజకీయ పార్టీలకు సంభందం లేని ప్రజలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలను, ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా తటస్థుల నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతుగా ఉండాలని అభ్యర్ధించారు. పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి, వైసీపి నేత మిద్దే మురళీ కృష్ణాయాదవ్ పాల్గొన్నారు.

Read Previous

మెడికవర్ లో క్యాన్సర్ కు పూర్తి స్థాయి వైద్య సేవలు : వెల్లడించిన వైద్యులు

Read Next

నెల్లూరులో పార్కును ప్రారంభించిన మాజీ మంత్రి అనీల్

Leave a Reply

Your email address will not be published.