Clock Of Nellore ( Muthukur ) – నెల్లూరుజిల్లా నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ( AP GENCO ) అధానీకి అప్పగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అఖిల పక్షం స్పష్టం చేసింది. జెన్ కో ను ప్రైవేటు పరం చేయరాదంటూ అఖిల పక్షం చేస్తున్న ఆందోళన మంగళవారంతో 310వ రోజుకు చేరుకుంది. మంగళవారం జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ధర్నా అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ జెన్ కో విద్యుత్ ప్లాంటును అధానీకి అప్పగించేందుకు ముఖ్యమంత్రి జగన్ కుట్ర చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ప్లాంట్ నష్టాల్లో ఉందని ప్రచారం చేస్తున్నారని, నాసిరకమైన 9 లక్షల టన్నుల బొగ్గును తీసుకొచ్చారని విమర్శించారు. నాశిరకం బొగ్గు కారణంగానే నష్టాలు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టును అధానికి ఇస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నేతలు ఎం మోహన్ రావు, బొమ్మి సురేంద్ర, సన్నారెడ్డి సురేష్ రెడ్డి, పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మూలం రమేష్, గోగుల శ్రీనివాసులు, కత్తి శ్రీనివాసులు, గడ్డం అంకయ్య, కిన్నెర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
