40 ఏళ్ల నుండి మురుగు సమస్య : శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు 21వ డివిజన్ లోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతం. రైల్వే ట్రాక్ కు పక్కనే ఉండే ప్రదేశం.. రైల్వే అధికారుల అనుమతి లేనిదే ఆ ప్రాంతంలో ఏ పనీ చేపట్టలేని నిజం… దీని కారణంగా గత 40 ఏళ్లుగా డ్రైనేజీ కాలువలు లేక స్థానికులు మురుగునీటితోనే సహజీవనం చేయాల్సిన దారుణం… ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 40 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి స్థానికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. విషయంలోకి వస్తే ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పక్కన నివాసం ఉండే ప్రజలు గత 40 ఏళ్లుగా మురుగునీటితో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ డ్రైనేజీ కాలువలు నిర్మించాలంటే రైల్వే అధికారుల అనుమతి కావల్సిరావడంతో స్థానికులు 40 ఏళ్లుగా మురుగుతో సహజీవనం చేయకతప్పలేదు. ఈ సమస్యను తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రైల్వే అధికారులను ఒప్పించి ఎట్టకేలకు అనుమతులు తీసుకొచ్చారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ అధికారులు సరిగా స్పందించక, డ్రైనేజీ నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. ఇదే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి గతంతో అదే మురుగు కాలువలో కూర్చొని గాంధీ గిరి నిరసన చేపట్టారు. ఎట్టకేలను అక్కడకు చేరుకున్న కార్పొరేషన్ అధికారులు నిర్మాణ పనులపై హామీ ఇచ్చారు. తాజాగా 51 లక్షలతో డ్రైనేజీ కాలువల నిర్మాణాలను పూర్తి చేశారు. ఇవాళ ఆ కాలువలను ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రారంభించారు.

ప్రారంభోత్సవానికి ఆ ప్రాంతానికి చేరుకున్న కోటంరెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలకడమే కాకుండా పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానికి కార్పొరేటర్ గౌరితో కలిసి నూతనంగా నిర్మించిన కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురైనారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మట్లాడుతూ అధికారుల అలసత్వాన్ని గుర్తు చేసేందుకే గాంధీ గిరి నిరసన చేపట్టినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాణుక్యపురి ప్రాంతంలో సాధించిన వంతెన గానీ, ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేగా రైల్వే అధికారుల నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ గాంధీగిరి నిరసన ద్వారా సాధించిన డ్రైనేజీ కాలువల నిర్మాణం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చాయన్నారు. 40 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన నేపద్యంలో స్థానికులు నిండు మనసుతో దీవిస్తుంటే వారి అభిమానానికి కళ్లు చెమ్మగిల్లాయన్నారు. ఈ డ్రైనేజీ కాలువ నిర్మాణం తన జీవితంలో ముఖ్యమైన ఘట్టమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంటే 5 ఏళ్లకు ఓ సారి కనిపించే నాయకుడు కాదని, నిరంతరం ప్రజల్లో ఉండాల్సిన నేత అని అంటూ ప్రజలు ఆహ్వానించినా, స్వాగతించినా, విమర్శించినా, ప్రేమతో పూలు చల్లినా వాటన్నింటిని సానుకూలంగా తీసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్నీ విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేశానని, మరి కొన్ని జరుగుతున్నాయని, ఇంకొన్ని చేయాల్సి ఉందన్నారు. అభివృద్ది విషయంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.

Read Previous

అపోలో ఆధ్వర్యంలో న్యూరో ఎసెన్షియల్ CME సదస్సు : హాజరైన వివిధ రాష్ట్రాల వైద్యులు

Read Next

ప్రియుడిపై మోజు : భర్తను చంపి మూటగట్టి కాలువలో పడేసిన భార్య

Leave a Reply

Your email address will not be published.