అపోలో ఆధ్వర్యంలో న్యూరో ఎసెన్షియల్ CME సదస్సు : హాజరైన వివిధ రాష్ట్రాల వైద్యులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో న్యూరో ఎసెన్షియల్స్ సి.ఎమ్.ఈ (CME) కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని మినర్వా హోటల్లో నిర్వహించిన ఈ CME కార్యక్రమానికి డాక్టర్ జి.అశోక్, అపోలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ ముఖ్య అతిధులుగా హాజరవగా, డాక్టర్ అచల్ గులాటి గెస్ట్ ఆఫ్ హానరుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి న్యూరాలజీ విభాగాధిపతి, కార్యక్రమ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బిందుమీనన్ మాట్లాడుతూ వైద్య విద్య నిరంతరం అభ్యసించాల్సిన ప్రక్రియని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఈ CME కార్యక్రమానికి TWO CREDIT HOURS ఇచ్చారని, వైద్యరంగంలో నవీనీకరించబడుతున్న విషయాల గురించి వైద్యులు నిరంతరం తెలుసుకుంటూ ఉండాలని అన్నారు. ప్రధానంగా వ్యాధి యొక్క క్లినికల్ లక్షణాలు, సంకేతాలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి వక్తలుగా ఢిల్లీ, తమిళనాడు నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పలువురు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి న్యూరో డాక్టర్ హరిత కుమారి మరియు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

వీడు మహా కేటుగాడు : కటకటాల వెనక్కు నెట్టిన నెల్లూరు పోలీసులు

Read Next

40 ఏళ్ల నుండి మురుగు సమస్య : శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.