దోచింది ఎక్కడ దాచారో చెప్పండి : సివిల్ సప్లైస్ కుంభకోణ నిందితులకు ఏసిబి ప్రశ్నలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా పౌర సరఫరాల సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తును అవినీతి నిరోధకశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే నిందితుల ఆస్తులపై దృష్టిసారించిన అధికారులు వారిని స్వయంగా విచారించాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నవారిని మూడు రోజుల పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. మాజీ డీఎం పద్మ. ఆసిస్టెంట్ మేనేజర్లు శర్మ, జయశంకర్, పొరుగు సేవల ఉద్యోగి, ప్రధాన సూత్రధారి శివకుమార్, ప్రైవేటు వ్యక్తులు పవన్, రాజును కస్టడీలో ప్రశ్నిస్తున్నారు. పౌర సరఫరాల సంస్థలో నొక్కేసిన 42 కోట్ల రూపాయలు ఏం చేశారు. ఆ నగదు ఎక్కడ ఉంచారు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అనే విషయాలపై ఏసిబి పోలీసులు కస్టడీలో ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. జైల్లో ఉన్న 11 మంది నిందితులతో పాటు మిగిలిన 24 మందిని విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారెవరెవరన్నది గుర్తించినట్లు తెలిసింది. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకోనున్నారు. తద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Previous

భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ అప్రమత్తం : ఎస్పీ విజయరావు ఆదేశాలు

Read Next

మా బిడ్డల భవిష్యత్తు ఏంటి సార్ : ఓవెల్ స్కూల్ విషయంలో కోటంరెడ్డి ఎదుట పేరెంట్స్ ఆవేదన

Leave a Reply

Your email address will not be published.