Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని జిల్లా కోర్టు భవనాల సముదాయంలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులకు మంగళవారం ఉచిత వైద్య శిభిరం జరిగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిభిరానికి నెల్లూరులోని ఎనెల్ హాస్పిటల్ వైద్యులు హాజరయ్యి న్యాయవాదులకు ఉచితంగా వివిధ వైద్య పరీక్షలను నిర్వహించారు. అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ ట్రెజరర్ ధనపాల్ రమేష్, న్యాయవాదుల గుమాస్తాలు తదితరులు పాల్గొన్నారు.