Clock Of Nellore ( Nellore ) – కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ ( NMMS )లో పాల్గొననున్న నెల్లూరులోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అండగా నిలిచింది యూత్ ఫర్ సేవా సంస్థ. పరీక్షలు రాసే విద్యార్ధులకు అవసరమైన స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందజేసింది. యూత్ ఫర్ సేవా సంస్థ వాలంటీర్లు పూర్ణచంద్, తరుణ్ కుమార్, తేజేంద్ర, బాబి భగత్, అమృత్ కుమార్ లు బుధవారం నగరంలోని పిఎంఎన్, పిఎన్ఎం, రామయ్య బడి తదితర మున్సిపల్ స్కూళ్లలో చదివే విద్యార్ధులకు ఉచితంగా స్టడీ మెటీరియన్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ NMMS స్కాలర్ షిప్ టెస్ట్ రాసే విద్యార్ధులకు ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. యూత్ ఫర్ సేవా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయా స్కూళ్ల హెడ్ మాస్టర్లు సంస్థ వాలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.
