మీ ఇంటి బిడ్డలా అండగా ఉంటా : దీవించాలని కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – మీ ఇంటి బిడ్డలా ఉంటా… ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయండి… నన్ను ఆశీర్వదించండి అంటూ ప్రజలను వేడుకున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గడప గడపకు వెళ్తున్నారు. ఆదివారం 22వ డివిజన్ లో కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సప్తగిరి లే అవుట్ లో పర్యటన పూర్తయిన అనంతరం ఆ డివిజన్ ప్రజలు, వైసీపి కార్యకర్తలు, సచివాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు. 22వ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ చేయవచ్చునని, కార్యాలయంలోనూ తాను అందుబాటులో ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ప్రజలతో కలిసి అల్పాహార విందు చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.

Read Previous

LVM3 – M2 రాకెట్ ప్రయోగం సక్సెస్ : కక్ష్యలోకి చేరిన 36 విదేశీ ఉపగ్రహాలు

Read Next

వైసీపిలో చేరిన టిడిపి సోషల్ మీడియా బృందం : ఆహ్వానించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published.