వైసీపినా కొడకల్లారా… చెప్పుతో కొడతా… ఊగిపోయిన పవన్ కళ్యాణ్

Clock Of Nellore ( Mangalagiri ) – వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ స్టార్ అనే వెధవల్ని చెప్పుతో కొడతానని చెప్పు చూపించి మరీ పవన్ హెచ్చరించారు. ప్యాకేజీ అనే సన్నాసుల్లారా మెడ పిసికి చంపేస్తానని, తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది మా సహనం అని, మమ్మల్ని తిట్టే ప్రతి వ్యక్తి తోలు ఒలిచేస్తానని పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యి మాట్లాడారు. మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానంటున్నారని, ‘మీరూ చేసుకోండ్రా.. ఎవడొద్దన్నారు?’ అని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

‘ఒరెయ్ వెధవల్లారా నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకురా? మీలా ఒక పెళ్ళి చేసుకుని 30 స్టెప్నీలతో తిరగడం లేదు’ అని జనసేనాని విరుచుకుపడ్డారు. ‘ఒంటి చేత్తో మెడ పిసికి చంపేస్తా నా కొడకల్లారా’ అని పవన్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘లండన్, న్యూయార్క్‌లో పెరిగాననుకుంటున్నారా? బాపట్లలో పుట్టా.. గొడ్డు కారం తిని పెరిగా’ అని పవన్ చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఒంగోలు గోపాలనగరంలో వీధి బడిలో చదివానని పవన్ చెప్పారు. ఇంకోసారి ప్యాకేజీ అని మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతానని పవన్ నిప్పులు చెరిగారు. ‘వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. రాడ్‌లతోనా.. హాకీ స్టిక్కులతోనా.. దేంతోనైనా రండి తేల్చుకుందాం.. నేటి నుంచి యుద్ధమే.. మీరు రెడీనా నా కొడకల్లారా ’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సై అంటే సై అన్నారు.

Read Previous

నెల్లూరులో బంగారు షాపులపై ఐటి అధికారుల దాడులు…

Read Next

పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ : ధీటుగా స్పందించిన మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.