Clock Of Nellore ( Udayagiri ) – నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంకి మండలం, చామదల గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన సచివాలయం నూతన భవనాన్ని, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.17.50 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను శనివారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తో కలసి ప్రారంభించారు. అనంతరం రూ. 1.41 కోట్లతో నిర్మించనున్న స్కూల్ అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసీ సభ్యులు శివలీలమ్మ, ఎం.పి.టి.సి సభ్యులు విజయరెడ్డి, పి.అమరావతమ్మ, సర్పంచ్ పి. సీతారామమ్మ, తహసీల్దార్ సీతామహాలక్ష్మీ, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
