పేరు పెట్టినంతమాత్రానా వైఎస్ఆర్ స్థాయి పెరగదు : జూ. ఎన్టీఆర్

Clock Of Nellore ( Internet Desk ) – విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఇన్నాళ్లుగా ఉన్న ‘ఎన్టీఆర్’ పేరును ప్రభుత్వం తొలగించడంపై ఆయన మనవడు, ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నొప్పింపక.. తానొప్పక అనే రీతిలో ఉందని నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. నందమూరి కుటుంబంలోని ఇతర కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేసి మరీ ముక్త కంఠంతో ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సుతిమెత్తగా స్పందించారని జూనియర్ ట్వీట్ చూసిన నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌ను యధాతథంగా చూద్దాం.

‘NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’.

Read Previous

30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే కోటంరెడ్డికి ప్రజల ధన్యవాదాలు

Read Next

ఎన్టీఆర్ పేరు తొలగింపు హేయమైన చర్య : కేతంరెడ్డి ధ్వజం

Leave a Reply

Your email address will not be published.