Clock Of Nellore ( Nellore ) – నరాల వ్యాధుల (Neurology & Neurosurgery) నిర్ధారణ మరియు చికిత్సలో వస్తున్న అత్యాధునిక మార్పులు, క్లినికల్ అప్‌డేట్స్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ ఆదివారం భారీ వైద్య సదస్సును నిర్వహించింది. విక్రమ సింహపురి న్యూరో క్లబ్ సహకారంతో “Neuro Sphere 2026: Clinical Updates & Best Practices” అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. నగరంలోని హోటల్ మినర్వా గ్రాండ్ లో నిర్వహించిన ఈ సదస్సులో భాగంగా న్యూరాలజీ, న్యూరో సర్జరీ, స్ట్రోక్ మేనేజ్‌మెంట్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వంటి కీలక అంశాలపై జాతీయ స్థాయి నిపుణులు ప్రసంగించారు. సదస్సులో పాల్గొన్న వైద్యులకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (APMC) ద్వారా 2 క్రెడిట్ పాయింట్లు కేటాయించినారు
కీలక ప్రసంగాలు & చర్చాంశాలు….
స్ట్రోక్ మేనేజ్‌మెంట్‌లో ‘అజ్ఞాత పక్షవాతం’పై సీనియర్ న్యూరాలజిస్ట్ డా. పి. దీక్షాంతి నారాయణ్, స్ట్రోక్ చికిత్సలో త్రోంబోలిసిస్ ప్రాముఖ్యతపై డా. బాల ఖాసీం ప్రసంగించారు. న్యూరో సర్జరీ విభాగంలో తలకు తగిలే గాయాలకు ఆధునిక చికిత్సపై డా. జి. దినేష్, పోస్ట్-ట్రామాటిక్ కన్కషన్స్‌పై డా. ఉదయ్ కిరణ్ అవగాహన కల్పించారు. ఎమర్జెన్సీ విభాగంలో న్యూరో అత్యవసర పరిస్థితుల నిర్వహణపై డా. ఎం.ఎన్. ప్రకాష్, అవయవ దాన నిర్వహణపై డా. పునుగోటి గౌతమ్ ప్రసంగించారు. న్యూరో ఆంకాలజీ సెషన్‌లో క్యాన్సర్ చికిత్స వల్ల కలిగే నరాల సమస్యలపై డా. మౌనిక రెడ్డి, న్యూరో ఆంకాలజీపై డా. జి. హరిప్రియ ప్రసంగించారు. అలాగే ఎన్సెఫలోపతిపై డా. వై. రఘు నందిని రెడ్డి, న్యూరో ఇంటర్వెన్షన్స్‌పై డా. ఎన్. కృష్ణ తేజ, గ్రే జోన్స్ సంబంధిత సవాళ్లపై డా. విశ్వ కుమార్ కె.ఎస్ చర్చించారు. మెడికవర్ హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా 21 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఒక అత్యాధునిక రోబోటిక్ సెంటర్ మరియు 3 ప్రత్యేక క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లతో అగ్రగామిగా నిలుస్తూ, నెల్లూరు ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలను అందిస్తోందని ఈ సందర్భంగా వైద్యులు తెలియజేశారు.
ఈ సదస్సులో విక్రమ సింహపురి న్యూరో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ A.V. రమణ మూర్తి, సెక్రటరీ డాక్టర్ N. S. సంపత్ కుమార్, పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ P. S. రెడ్డి, AP మెడికల్ కౌన్సిల్ అబ్సర్వర్ డాక్టర్ అశోక్ రెడ్డి మరియు మెడికవర్ హాస్పిటల్ న్యూరో డాక్టర్స్ బృందం డాక్టర్ పి.దీక్షాంతి నారాయణ్, డా “బాల ఖాసీం, “డా జి. దినేష్, డా ఉదయ్ మరియు డాక్టర్ హరి ప్రియా, డాక్టర్ మౌనిక రెడ్డి పాల్గొన్నారు.
