నెల్లూరు అపోలో హాస్పిటల్ లో కాస్మోటిక్ క్లినిక్ ప్రారంభం … !

  • నెల్లూరులో అపోలో కాస్మోటిక్ క్లినిక్ ప్రారంభం
  • మెట్రో సిటీలకే పరిమితమైన కాస్మోటిక్ సర్జరీలు ఇక నెల్లూరులోనూ అందుబాటులోకి
  • సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాటు
  • అందాన్ని పెంపొందించుకునేందుకు శాశ్వత పరిష్కారం కాస్మోటిక్ సర్జరీ
  • వయస్సు పెరుగుదలతో వచ్చే మార్పులను కూడా సరిచేసుకునే అవకాశం
  • వివరాలను వెల్లడించిన డాక్టర్ శ్రీనివాస రావు, డాక్టర్ శ్రీరామ్ సతీష్,

Clock Of Nellore ( Nellore ) – కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కాస్మోటిక్ సర్జరీ సేవలను నెల్లూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస రావు నేతృత్వంలో ప్రత్యేకంగా కాస్మోటిక్ క్లినిక్ ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ ను గురువారం డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస రావు, యూనిట్ హెడ్ బాలరాజు ప్రారంభించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందాన్ని పెంపొందించుకొనేందుకు, వయస్సు పెరుగుదలతో ముఖంపై వచ్చే మార్పులను సరిచేసుకునేందుకు ఒకప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే కాస్మోటిక్ సర్జీరీలను చేయించుకునే వారని తెలిపారు. కానీ నేడు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో డాక్టర్ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అందరికీ అందుబాటు ఫీజులతో ఆ సేవలను ప్రారంభించిందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ కొనియాడారు.కాస్మోటిక్ సర్జీల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు.

నాన్ సర్జికల్ విధానంలో ముఖ్యంగా BOTOX ( బొటాక్స్ ), FILLERS ( ఫిల్లర్స్ ), FAT INJECTIONS ( ఫ్యాట్ ఇంజక్షన్స్ ), THREAD LIFTING ( త్రెడ్ లిఫ్టింగ్ ), EXOSOMES ( ఎక్సో సోమ్స్ ), SKIN BOOSTER ( స్కిన్ బూస్టర్స్ ) చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. సర్జికల్ విధానంలో ప్రధానంగా FORE HEAD LIFT ( ఫోర్ హెడ్ లిఫ్ట్ ), BROW LIFT ( బ్రో లిఫ్ట్ ), FACE LIFT ( ఫేస్ లిఫ్ట్ ), NECK LIFT ( నెక్ లిఫ్ట్ ), RHINO PLASTY ( రైనో ప్లాస్టీ ), BLEPHARO PLASTY ( బ్లెఫరో ప్లాస్టీ ), DIMPLE CREATION ( డింపుల్ క్రియేషన్ ), LIP REDUCTION ( లిప్ రిడక్షన్ ), LIP AUGMENTATION ( లిప్ ఆగ్మెంటేషన్ ), HAIR TRANSPLANTATION ( హెయిల్ ట్రాన్స్ ప్రాంటేషన్ ), EAR CORRECTION PROCEDURES ( ఇయర్ కరక్షన్ ప్రొసీజర్స్ ), BREAST AUGMENTATION ( బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ), BREAST REDUCTION ( బ్రెస్ట్ రిడక్షన్ ), BREAST LIFT SURGERY ( బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ ), GYNECOMASTIA CORRECTION ( గైనెకోమాస్టియ కరక్షన్ ), BRACHIOPLASTY ( బ్రాకియో ప్లాస్టీ ), LIPOSUCTION ( లైపోసక్షన్ ), BODY CONTOURING ( బాడీ కాంటూరింగ్ ), TUMMY TUCK SURGERY ( టమ్మి టక్ సర్జరీ ), COSMETIC GYNECOLOGY ( కాస్మోటిక్ గైనకాలజీ ), DOUBLE CHIN CORRECTION ( డబుల్ చిన్ కరెక్షన్ ), JAW LINE CORRECTION ( జా లైన్ కరెక్షన్ ) లాంటి కాస్మోటిక్ సర్జరీ సేవలు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రమాదాల్లో ముఖంపై ఏర్పడే మార్పులను సరిచేయించుకునేందుకే ఎక్కువ మంది కాస్మోటిక్ సర్జరీలు చేయించుకునేందుకు ముందుకొచ్చేవారని, కానీ నేడు అందాన్ని పెంపొందించుకునేందుకు, ముఖంపై ఉన్న అవయవాల చక్కటి కూర్పు కోసం కాస్మోటిక్ సర్జరీలను చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, అందుకే నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకంగా కాస్మోటిక్ క్లినిక్ ను ఏర్పాటు చేశామన్నారు. సర్జరీకి అయ్యే ఫీజు కూడా అందరికీ అందుబాటులో ఉంటుందని, ఈ సర్జరీలు 100 శాతం సురక్షితమని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

 

Read Previous

మెదడులో అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ : విజయవంతంగా చేసిన మెడికవర్ వైద్యులు

Read Next

జూన్ 12న విఆర్ హైస్కూల్ పున: ప్రారంభం – వెల్లడించిన మంత్రి నారాయణ కుమార్తె

Leave a Reply

Your email address will not be published.