Clock Of Nellore ( Sri Hari Kota ) – నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈనెల 18వ తేదీనా PSLV – C61 రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా EOS-09 (RISAT-1B) ఉప గ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంభందించి శనివారం ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 5 గంటలా 59 నిముషాలకు షార్ లోని మొదటి ల్యాంచ్ ప్యాడ్ నుండి PSLV – C61 రాకెట్ నిప్పులు చిమ్ముతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. EOS-09 (RISAT-1B) ఉప గ్రహం వ్యవసాయం, అటవీ నిర్వహణ, నీటి వనరుల పర్యవేక్షణ, నగర ప్రణాళిక, మరియు విపత్తు నిర్వహణ వంటి అనేక రంగాల్లో కీలక డేటాను అందిస్తుంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ, రాత్రి లేదా పగలు తేడా లేకుండా, భూమి ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించగలదు.
