మెడికవర్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం : కేక్ కట్ చేసిన డాక్టర్ ధీరజ్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, నర్సింగ్ విభాగం హెడ్ శైలజ, ఇతర విభాగాల అధిపతులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా నర్సులతో కలిసి హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి కేక్ కట్ చేసి నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగికి చికిత్స మొదలైనప్పటి నుండి తిరిగి వారు కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వరకూ రోగి వెన్నంటే ఉండి సేవలు చేసే నర్సులు దైవంతో సమానమని కొనియాడారు. అనుక్షణం నర్స్, సిస్టర్ అని రోగులు పిలుస్తున్నా విసుగు చెందకుండా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా ఉండే వారే నర్సులని గుర్తు చేశారు. వారి సేవలను వెలకట్టలేమని ప్రసంశించారు.

హాస్పిటల్ నర్సింగ్ హెడ్ శైలజ మాట్లాడుతూ ఈ ఏడాది ” మన నర్సులు – మన భవిష్యత్తు ” అనే నినాదంతో పని చేస్తూ ముందుకెళ్తున్నామని, ఆరోగ్య సంరక్షణలో నర్సులు గుండె వంటి వారని పేర్కొన్నారు. వైద్యులు, రోగులకు మధ్య వారధిలా ఉంటూ రోగి ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా అహోరాత్రులు నర్సులు శ్రమిస్తారని, ఆసుపత్రుల్లో నర్సుల సేవలు ఎంతో ముఖ్యమైనవని గుర్తు చేశారు. వారి సేవలను గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం నర్సులకు వివిధ సాంస్క్రృతిక కార్యక్రమాలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నీ విభాగాల వైద్యులు, నర్సింగ్ విభాగం సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, పిఆర్వో చందు వర్మ పాల్గొన్నారు.

Read Previous

ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మేయర్ భానుశ్రీ జన్మదిన వేడుకలు

Read Next

రేపే నెల్లూరు రూరల్ లో మహాద్భుత ఘట్టానికి ఆవిష్కరణ…

Leave a Reply

Your email address will not be published.