Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పొదలకూరు రోడ్డు నిర్మాణ పనులు మూడు నెలల్లోగా పూర్తి చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైన్ల నిర్మాణానికి సోమవారం ఆయన శంఖుస్థాపన చేశారు. 36 లక్షలతో చేపట్టే ఈ డ్రైన్ల పనులను సంజయ్ గాంధీ నగర్ సెంటర్ లో ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులోని బట్వాడిపాళెం సెంటర్ నుండి డైకాస్ రోడ్డు వరకూ రోడ్డు నిర్మాణాన్ని సర్వాంగ సుందరంగా చేపడుతున్నట్లు తెలియజేశారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైన్ల నిర్మాణం, రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం పనులు మూడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజేపి నేతలు పాల్గొన్నారు.
