Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని 19వ డివిజన్ రామలింగాపురంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ఆయన ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ జ్యోతి ప్రియ పట్టుబట్టి ఈ రోడ్డును సాధించారని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆమెను అభినందించారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9నెలల వ్యవధిలోనే 19వ డివిజన్ లో 4 కోట్ల 37 లక్షల అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేత మదన్ కుమార్ రెడ్డి, జనసేన నేత చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, జానా శివయ్య, డిష్ రమేష్, దార్ల వెంకటేశ్వర్లు, జల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
