Clock Of Nellore ( Nellore ) – వయస్సు పైబడి మోకాలి నొప్పులతో బాధపడేవారు నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో ఉచితంగా నిర్వహించే ఆర్ధో పెడిక్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 28వ తేదీ వరకూ మోకాలి మార్పిడికి సంభందించి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్ తో పాటూ మోకాలు ఎక్స్ రే కూడా తీస్తామని వెల్లడించారు. ఈ పరీక్షల్లో మోకాలి మార్పిడి చేయాలని రిపోర్టు వస్తే వారికి అధునాత పద్దతుల్లో తక్కువ ఫీజులతోనే మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేస్తామన్నారు. అధునాతన పద్దతుల్లో చేసే మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలో నాణ్యమైన ఇంప్లాంట్స్ ను వినియోగిస్తామని, ఐసియులో కూడా ఉండాల్సిన పనిలేదన్నారు. త్వరగా కోలుకోవచ్చునని, కేవలం ఒక్క రోజులోనే నడవగలరని తెలియజేశారు. మోకాలి నొప్పులతో బాధపడే వారు ఉచితంగా నిర్వహించే ఈ స్క్రీనింగ్ పరీక్షలను సద్వినియోగం చేసుకుని నొప్పిలేని జీవితంలోకి అడుగుపెట్టాలని డాక్టర్ ధీరజ్ రెడ్డి సూచించారు.
