Clock Of Nellore ( Nellore ) – అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో తాను రాజీ పడే ప్రసక్తే లేదని, అధికారులు కూడా అదే విధంగా ఉండాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై తన కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. కాస్త ఆలస్యమైనా పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని సూచించారు. నాణ్యత విషయంలో ఏదైనా సమస్య వస్తే తన దృష్ఠికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
