అమ్మో కేటుగాళ్లు… 56 బైకులు కొట్టేశారు… ఎట్టకేలకు బొక్కలోకెళ్లారు…

Clock Of Nellore ( Nellore ) – వారంతా పాత నేరస్తులు… అందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు… రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిని విక్రయించుకుంటూ జల్సాల్లో మునిగితేలిపోతున్నారు. తక్కువ ధరకు రావడంతో అమాయకులు అవి కొనే వారు. నెల్లూరుజిల్లా, అల్లూరు మండలం, నార్త్ ఆములూరుకు చెందిన ఆవల శివ, కామంచి నాని, శ్రీరామ్ రవి, నల్లగుండ్ల హోసన్నా అనే నలుగురు ఏడాది పైగా నుండి స్వస్థలంలో కనిపించడం లేదు. దీనిపై దృష్ఠి సారించిన నెల్లూరు సబ్ డివిజన్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు సాంకేతికత ఆధారంగా వారు ఎక్కడున్నారో తెలుసుకున్నారు. వారి కదలికలపై మాటు వేశారు. బైక్ ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ మార్క్ విచారణ చేపట్టడంతో చోరీల వివరాలను పూసగుచ్చినట్లు తెలియజేశారు. దీంతో పోలీసులు వారి చోరీ చేసిన 56 బైకులను రికవరీ చేశారు. దీనిపై శుక్రవారం నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. నెల్లూరుజిల్లాతో పాటూ తిరుపతి, బాపట్ల, ప్రకాశం, కడప, తూర్పు గోదావరి జిల్లాలతో పాటూ అనేక జిల్లాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడిందని చెప్పారు.

Read Previous

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : కాంగ్రెస్ జాతీయ నేత కొప్పుల రాజు

Read Next

నిద్రలేమి సమస్యలతో న్యూరోలాజికల్ రోగాలు : హెచ్చరించిన మెడికవర్ వైద్యులు

Leave a Reply

Your email address will not be published.