Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షునిగా ప్రముఖ న్యాయవాది, ఆ పార్టీ నేత మలిరెడ్డి కోటారెడ్డి నియమితులు కానున్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరులో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరునిగా కొనసాగిన కోటారెడ్డి మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో వైసీపి అభ్యర్ధుల తరపున విస్త్రృతంగా ప్రచారం చేరారు. పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీలోని అనేక మంది నేతలు మౌనంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపి నగర అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన సన్నపురెడ్డి పెంచలరెడ్డి… ఫలితాల తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపద్యంలో పార్టీ నేతలు కోటారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదనను మలిరెడ్డి కోటారెడ్డి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. పార్టీ కోసం కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటే వైసీపి నగర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.