త్వరలో మహిళలకు ఉచిత బస్సు : సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో కొనకళ్ల వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు అన్నారు. గురువారం నెల్లూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు జోన్ చైర్మన్ గా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారము చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఆదనపు బస్సు సౌకర్యాలను కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో బస్సు చార్జీలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ 7 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జోన్ లో ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకొని అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో నెల్లూరు జోన్ ను ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. నెల్లూరు జోన్ లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోన్ ప్రస్తుతం లాభాల బాటలో ఉందని ఈ సందర్భంగా ఆయన అధికారులను అభినందించారు. నెల్లూరు జోన్ నుండి మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని అని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోన్ కు అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏ.పి.ఎస్.ఆర్.టి.సి నెల్లూరు జోన్ ను అభివృద్ధి పథంలో నడిపించి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 4 సూపర్ లగ్జరీ బస్సులను ఒక ఎక్స్ ప్రెస్ బస్ ను రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ప్రారంభించారు. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వంశీ రెడ్డి, సన్నపరెడ్డి దయాకర్ రెడ్డి , ఉండపల్లి భరత్ కుమార్ యాదవ్, కర్నాటి ఆంజనేయ రెడ్డి, నాగరాజారెడ్డి హిందూపూర్ శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున యాదవ్, వాకాటి నారాయణ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, గంగినేని కృష్ణయ్య, రాజేశ్వరమ్మ, గోలి మధుసూదన్ రెడ్డి , నెల్లూరు జోన్ ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ మురళి బాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.వెంకటేశ్వర రావు,తదితరులు పాల్గొన్నారు.

Read Previous

మెడికవర్ లో విజయవంతంగా పూర్తయిన 50వ EBUS ప్రొసీజర్స్

Read Next

వైసీపి నెల్లూరు సిటీ అధ్యక్షునిగా మలిరెడ్డి కోటారెడ్డి ?

Leave a Reply

Your email address will not be published.