Clock Of Nellore ( Nellore ) – హుందా రాజకీయాలకు పెట్టిందిపేరులా సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ పనితీరు ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరులు ప్రసంశించారు. నెల్లూరు నగర ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, యుతనేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతో భేటీ అయ్యారు. తమ కార్యాలయానికి విచ్చేసిన డాక్టర్ పొంగూరు నారాయణను వారు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, ఘనంగా సత్కరించారు. సిటీ ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన డాక్టర్ పొంగూరు నారాయణ పనితీరును వారు ప్రసంశించారు. హుందా రాజకీయాలకు డాక్టర్ నారాయణ పెట్టింది పేరని కొనియాడారు. అనంతరం వారు ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు రాజా నాయుడు, సాబీర్ ఖాన్, చెక్క సాయి సునీల్, అరవ శీను, కార్పొరేటర్లు మురారి, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
