Clock Of Nellore ( Kavali ) – నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుండి చెన్నై వైపు ప్రయాణీకులతో వెళ్తున్న శ్రీ వెంకట రమణ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపుతప్పింది. డివైడర్ ను ఢీ కొట్టి పక్క రోడ్డులోకి దూసుకెళ్లింది. నెల్లూరు నుండి కావలి పైవు వస్తున్న లారీని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణీకులంతా గాయపడ్డారు. ఓ ప్రయాణీకుడి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. గాయపడ్డ ప్రయాణీకులను కావలి ఏరియా వైద్యశాలతో పాటూ నెల్లూరులోని జిజిహెచ్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: kavali news Nellore News Nellore police NH 16 Accidents Sri Venkata Ramana Travels Bus Accidents