నారాయ‌ణ‌కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన ప్ర‌జ‌లు : వీఆర్సీ టూ మూలాపేట వరకూ భారీ ర్యాలీ

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించేందుకు కూట‌మి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప‌ర్వంలో… ప్ర‌చారానికి చివ‌రి కావ‌డంతో… మాజీ మంత్రి నారాయ‌ణ, ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డితో కలసి నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా….ఎన్నిక‌ల స‌మ‌రానికి సై అంటూ… నారాయ‌ణ‌, వీపీఆర్‌లు విల్లు ఎక్కిపెట్టి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో…నారాయ‌ణ‌తోపాటు టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు అబ్ధుల్ అజీజ్‌, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి,రూప్ కుమార్ యాదవ్.. నారాయ‌ణ స‌తీమ‌ణి ర‌మాదేవి, కుమార్తెలు డాక్ట‌ర్ సింధూర పొంగూరు, డాక్ట‌ర్ ష‌ర‌ణిలు పాల్గొన్నారు. ర్యాలీ న‌గ‌రంలోని వీఆర్సీ సెంట‌ర్ నుంచి గాంధీబొమ్మ‌, ట్రంక్ రోడ్డు, ములుముడి బ‌స్టాండ్, చిన్న‌బ‌జారు, పెద్ద బ‌జారు, మూలపేట సెంట‌ర్ వరకు ర్యాలీ కొన‌సాగింది. ముందుగా…నారాయ‌ణ‌కి టీడీపీ శ్రేణులు, ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ర్యాలీ పొడ‌వునా…ఆయ‌న‌కి ప్ర‌జ‌లు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. జై టీడీపీ…జై నారాయ‌ణ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో తెలుగు త‌మ్ముళ్లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మ‌హిళా శ‌క్తి, యువ‌త త‌ర‌లి రావ‌డంతో… నెల్లూరు న‌గ‌రం ప‌సుపుమ‌యంగా మారిపోయింది.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ మాట్లాడుతూ… ఒక నాయ‌కుడు ఓ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేస్తే… సంపూర్ణ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌న్నారు. 2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెల‌వ‌క‌పోయినా… నేను పుట్టిన నెల్లూరును అన్నీ రంగాల్లో డెవ‌ల‌ప్‌మెంట్ చేయాల‌నే ల‌క్ష్యంతో ఎన్నో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాన‌ని చెప్పారు. దాని ఫ‌లిత‌మే… నేటి అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ గానీ, తాగునీటి ప‌థ‌కం గానీ, ఎండ్ టూ ఎండ్ రోడ్లు గానీ… ఇలా చెప్పుకుంటే అనేక సంక్షేమాభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను నెల్లూరు ప్ర‌జ‌ల సంక్షేమం కోసం చేప‌ట్టాన‌ని చెప్పారు. గ‌తంలో పోటీ చేయ‌క‌పోయినా ఎంతో చేశాన‌ని, కానీ ప్ర‌స్తుతం నేను ప్ర‌త్య‌క్షంగా పోటీ చేస్తున్నాన‌ని, ప్ర‌స్తుతం నా మీద బాధ్య‌త ఇంకా పెరిగింద‌ని చెప్పారు. నెల్లూరును స‌మ‌గ్రాభివృద్ధి చేయ‌డ‌మే నా ధ్యేయ‌మ‌ని నారాయ‌ణ మాటిచ్చారు. జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో సిటీ ఎమ్మెల్యేగా న‌న్ను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిని గెలిపించాల‌ని కోరారు. త‌ద్వారా కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రాష్ట్రం నుంచి నేను నిధులు తీసుకొచ్చి… నెల్లూరు అభివృద్ధి చేస్తామ‌ని నెల్లూరు ప్ర‌జ‌ల‌కు మాటిస్తున్న‌ట్లు పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు.

నెల్లూరు ఎంపీ టీడీపీ అభ్య‌ర్థి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ ప్ర‌భుత్వంలో ఏ ప‌ని కూడా జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌లంతా తీవ్రంగా న‌ష్ట‌పోయార‌న్నారు. జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపిస్తే… ఎన్‌డీఏ భాగ‌స్వామ్యంతో నెల్లూరు జిల్లాను స‌మ‌గ్రంగా అభివృద్ధి చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే రాష్ట్రంలో కూట‌మి గెల‌వాల్సి ఉంద‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంతా ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లోని కూటమి అభ్య‌ర్థుల‌ను గెలిపించి గ‌వ‌ర్న‌మెంట్ ఫామ్ చేయాల‌ని కోరారు.

Read Previous

నెల్లూరులో ఉత్సాహంగా వైసీపి బైక్ ర్యాలీ – ప్రచారం ముగింపు రోజు సరికొత్త జోష్

Read Next

సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : జిల్లా వ్యావ్తంగా మొదలైన ఏర్పాట్లు

Leave a Reply

Your email address will not be published.