మోసపూరిత వైసీపిని తరిమికొట్టండి : ప్రచార సభల్లో కోటంరెడ్డి పిలుపు

Clock Of Nellore ( Nellore ) – ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు లాక్కునే మోసపూరిత వైసీపి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టాలని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన నెల్లూరు 12, 24వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 12వ డివిజన్ లోని సౌత్ రాజుపాళెంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డితో ప్రచారం నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కోటంరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అలాగే 24వ డివిజన్ లోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో కూడా కోటంరెడ్డి ప్రచారం నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా ప్రచార సభల్లో కోటంరెడ్డి ప్రసంగించారు. నిత్యం ప్రజల కోసం ప్రజలతోనే ఉంటున్న తనను ఈ ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్ధించారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, ప్రపంచ నగరాలతో అద్భుతమైన రాజధాని అమరావతి పోటీ పడాలంటే చంద్రబాబును సిఎంను చేసుకోవాలని సూచించారు. టిడిపి సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రత్యేకించి మహిళలకు ఎంతో మేలు జరగనుందని, ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి, మరో చేత్తో వంద రూపాయలు లాక్కునే మోసపూరిత వైసీపి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కోటంరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Read Previous

ప్రసన్నకు బైబై చెప్పండి : వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు

Read Next

ఆదాలతోనే అభివృద్ధి : 12వ డివిజన్ లో ఆదాల కుమార్తె హిమబింధు ప్రచారం

Leave a Reply

Your email address will not be published.