అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నా : ప్రచారంలో వెల్లడించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్ధిగా చరిత్ర సృష్ఠించే మెజారీటీ విజయం సాధించబోతున్నానని నెల్లూరు రూరల్ తెలుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్ఠిలో ఉంచుకుని ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన 17, 36వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహంచారు. 17వ డివిజన్ లోని ఆకుతోట, వడ్డిపాళెం, గుండ్లపాళెం, 36వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఆయన విస్త్రృతంగా పర్యంచారు. ప్రచారం కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్థానిక టిడిపి నేతలతో పాటూ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు తనను సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని, వారి ఆశీర్వాదంతో చరిత్ర సృష్ఠించే మెజార్టీతో తాను విజయం సాధించబోతున్నానని అన్నారు. ప్రజలు భవిష్యత్తును దృష్ఠిలో ఉంచుకుని ఓటు వేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ ను నాలుగు వేలకు పెంచడం జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రపంచ నగరాలు పోటీ పడే విధంగా అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం కానుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి, మరో చేత్తో 100 రూపాయలు లాక్కునే దుర్మార్గపు వైసీపి ప్రభుత్వానికి ప్రజలంతా ఓటుతో బుద్ది చెప్పాలని కోటంరెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిను గెలిపించాలని ప్రజలను కోరారు.

Read Previous

వారంలో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి : ప్రచారంలో వేమిరెడ్డి

Read Next

అభివృద్ధిని చూసి ఓటు వేయండి : ఓటర్లను కోరిన ఆదాల కుమార్తె హిమబింధు

Leave a Reply

Your email address will not be published.