నెల్లూరును అభివృద్ధి చేసింది నారాయణే… చేసేది కూడా ఆయనే : పొంగూరు రమాదేవి

Clock Of Nellore ( Nellore ) – ప్రజాసేవకై నెల్లూరు నగరాన్ని భాగ్యనగరంగా తీర్చిదిద్దేందుకు, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, పొంగూరు నారాయణను మీ ఇంటి బిడ్డల ఆశీర్వదించాలని నగరంలోని 51 వ డివిజన్ కపాడిపాలెం, కన్యకల హాస్పిటల్, 6వ డివిజన్ పప్పుల వీధి పార్క్ సెంటర్, పలు ప్రాంతాలలో సోమవారం మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి, నారాయణ సోదరి వల్లి, ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు, ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ, విపిఆర్ లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను చేర్చడం జరిగింది, గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో క్రిస్టియన్ ల కొరకు 5 ఎకరాల స్మశాన వాటిక, పేద ప్రజల కోసం రెండు కమ్యూనిటీ హాళ్లు, 5 మేజర్ కాలువలు, కల్వర్టులు, సిమెంట్ రోడ్లు, ఎల్ఇడి లైట్లు, అని నారాయణ సార్ గారే మేము అడక్కు ముందే చేశారని, నారాయణ సారే రావాలి, మా కోసం నగర అభివృద్ధి కోసం, మేము గెలిపించుకుంటామని ప్రజలు భరోసాని వారి యొక్క నమ్మకాన్ని తెలియజేస్తున్నారు, చంద్రన్న అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్ళకే పింఛన్ అందించనున్నారు, అలాగే ప్రతి పేదవాడి ఆరోగ్యానికి దేశంలోనే ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్య భీమా 25 లక్షలు, టిడిపి ప్రభుత్వం అందజేయనుంది, వచ్చే ప్రభుత్వంలో బలమైన స్థితిలో ఉండేందుకు, నెల్లూరు ఎంపీగా వీపీఆర్ గారిని, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అందరినీ అభ్యర్ధించారు.

Read Previous

ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి : విద్యార్ధులతో విజయసాయి ముఖాముఖి

Read Next

వారంలో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి : ప్రచారంలో వేమిరెడ్డి

Leave a Reply

Your email address will not be published.