Clock Of Nellore ( Kodavalur ) – కాంట్రాక్టర్ల వద్ద నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి వసూలు చేసిన కోట్లాది రూపాయల లంచాల్లో నుంచి 5 శాతం ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించినా గ్రామాల్లో రోడ్లు, తాగునీరు లాంటి మౌళిక సమప్యలు పరిష్కారం అయి వుండేవన్నారు కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభిప్రాయపడ్డారు. కొడవలూరు మండలం, రామన్నపాళెం గ్రామంలో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరు సార్లు గెలిచామని గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే కోవూరు నియోజక వర్గంలో చాలా గ్రామాలు సమస్యల మయంగా మారాయన్నారు. ఎవరైన చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశాన వసతులు కూడా కల్పించలేని అసమర్ద ఎమ్మెల్యే ఆరు సార్లు గెలిచి సాధించింది ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకొస్తేనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నిరుద్యోగ సమస్య సమూలంగా పరిష్కారం కావాలంటే పాలనా అనుభవం వున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతోందన్నారు. వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్, రంజాన్ తోఫా, క్రిస్మస్ మరియు సంక్రాంతి కానుక లాంటి ఎన్నో జనరంజక పధకాలు టిడిపి అధికారంలోకొచ్చాక తిరిగి కొనసాగిస్తామన్నారు. తాను మాటల మనిషిని కాదని ఎమ్మెల్యేగా గెలిచాక నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటానన్నారు. ప్రత్యక్ష రాజకీయాలలోనికి రాక ముందే ప్రజాసేవలో వున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా, తనను కోవూరు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రశాంతి రెడ్డి ఓటర్లను కోరారు.
