టిడిపిలోనే మహిళలకు, కార్యకర్తలకు గౌరవం : కోటంరెడ్డి సమక్షంలో పలువురు చేరిక

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన వైసీపి నేతలు, కార్తకర్తలు స్వచ్ఛంధంగా రూరల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. 20 రోజుల క్రితం వైసీపి కండువా కప్పుకున్న మహిళా నాయకురాలు నల్లగట్ల ప్రభావతి గురువారం తిరిగి టిడిపిలో చేరారు. మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభావతి ఆమె అనుచరులు శారద, మాధవి, విజయ, భవాని, షేక్ కరీమా తదితరులు కోటంరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. వారందరికీ పసుపు కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. గత పదేళ్లుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నానని, ఇటీవల కొందరి ప్రోద్భలంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైసీపిలో చేరానని ప్రభావతి అన్నారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి వద్ద విలువ, గౌరవం లేదన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో పదేళ్లు పనిచేశానంటే ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం, విలువేనని స్పష్టం చేశారు. వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని నల్లగట్ల ప్రభావతి స్పష్టం చేశారు. అలాగే కొత్త వెల్లంటి గ్రామానికి చెందిన గురునాథం పోలయ్య, కట్టా చిన్నబ్బయ్య, వెంకట రమణ, రాజా, నాగరాజు, చిన్న సుబ్బయ్య, పోలా భాస్కర్, షేక్ సుధీర్ బాషా, దినేష్, చిన్ని తదితరులు కూడా వారి మిత్ర బృందాలతో కలిసి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. 25వ డివిజన్ బుజబుజ నెల్లూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం మైనార్టీ సెల్ అధ్యక్షురాలు సయ్యద్ నాగూర్ బి వారి అనుచరులతో కలిసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. శ్రీధర్ రెడ్డి విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

Read Previous

వైసీపిలో చేరిన 18వ డివిజన్ టిడిపి నేతలు : ఆహ్వానించిన ఆదాల

Read Next

ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే కారణం ఇదే : వెల్లడించిన నారాయణ

Leave a Reply

Your email address will not be published.