చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు : ప్రచారంలో విమర్శించిన విజయసాయి రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వెయాలని నెల్లూరు ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరు ఎంపి అభ్యర్థిగా తాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ మీ ముందుకు వచ్చామని తమను ఆశీర్వదించాలన్నారు. నెల్లూరు సిటి నియోజకవర్గంలోని 3వ డివిజన్ శ్రీలక్ష్మి నగర్ లో ఎన్నికల ప్రచారంలో ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్, కార్పోరెటర్ సంక్రాంతి అశ్వనీ, నూడా చైర్మన్ ముక్కాల ద్వారకా నాథ్, ఆనం జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సిపి లౌకిక వాద సెక్యులర్ పార్టీ అని, ‍తమ పార్టీకి అన్ని కులాలు, మతాలు సమానమేనన్నారు. యునిఫామ్ సివిల్ కోడ్ విషయంలో చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని సవాల్ చేశారు. కూటమిలో ఉన్న బిజెపి – జనసేన – టిడిపి పార్టీలు అవకాశవాద రాజకీయాలు చెస్తున్నాయని మండిపడ్డారు. జగన్ మీద కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అభ్యర్ధులను నిలబెట్టి కూటమికి సహకరిస్తుందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తాను, ఖలీల్ పేద బడుగు బలహిన వర్గాల ప్రతినిధులుగా పోటి చేస్తుంటే… టిడిపి అభ్యర్ధులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగురు నారాయణ పెత్తందారుల ప్రతినిధులుగా పోటి చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో జరుగుతోంది క్యాష్‌ వార్‌ అన్న చంద్రబాబు మాటలు వింటే – భారీ మొత్తాల్లో క్యాష్‌ తో దిగిన టీడీపీ అభ్యర్ధులు జనాదరణ లేక ఓడిపోవడానకి సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మొన్ననే 74 సంవత్సరాలు నిండిన చంద్రబాబుకు ఇది చివరి ఎన్నికలని తెలిపారు. అనుభవ రాహిత్యం ఉన్న అతని కుమారుడు లొకేష్ ను అందలం ఎక్కించాడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కొసం జగన్ పని చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ సిపి ప్రజా సేవకులైన వాలంటీర్లు హక్కులను కాపాడుతుందన్నారు. గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ సిపి చేసిన అభివృద్ధికి సంక్షేమానికి ఓటు వెయాలని ప్రజలను ఆయన కోరారు.

Read Previous

నామినేషన్ దాఖలు చేసిన పొంగూరు నారాయణ : మరో సెట్ వేసిన సతీమణి రమాదేవి

Read Next

నెల్లూరుజిల్లాలో 4వ రోజు 33 నామినేషన్లు : పలు చోట్ల డమ్మీ అభ్యర్ధులుగా కుటుంబీకులు

Leave a Reply

Your email address will not be published.