Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నెల్లూరు మినీ బైపాస్ లోని వారి నివాసంలో పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నామినేషన్ పత్రాలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి కుమార్తె హిమబింధు నామినేషన్ పత్రాలను అందజేసింది. తర్వాత ఆయన బయలుదేరే కారుకు సతీమణి, కుమార్తె ఎదురు రాగా అక్కడి నుండి ఆదాల బయలుదేరి మూలాపేటలోని శివాలయంకు చేరుకున్నారు. అక్కడ కుమార్తె హిమబింధు, మేయర్ స్రవంతి, వైసీపి నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డితో కలిసి పూజలు నిర్వహించారు. అక్కడి నుండి నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంకు చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి అయిన ఆర్డీఓ మలోలకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఆదాల నివాసం కోలాహలంగా మారింది. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆదాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
