విద్యార్ధి నేత మౌళికి డాక్టరేట్ : ప్రధానం చేసిన విక్రమ సింహపురి యూనివర్శిటీ

Clock Of Nellore ( Nellore ) – విద్యార్ధుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేసిన వ్యక్తి, స్టూడెంట్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ( SRPF ) వ్యవస్థాపకులు సల్ల మౌళికి నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. యూనివర్శిటీలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ నందు పరిశోధన విద్యార్ధిగా ఉన్న మౌళి… కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ ( CSR ) ఇంటర్ వెన్షన్స్ టువర్డ్స్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ – ఏ స్టడీ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్… అనే అంశంపై గత ఐదేళ్లుగా పరిశోధన చేశారు. యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. మధుమతి పర్యవేక్షణలో సాగిన ఈ పరిశోధన అంశం జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో కూడా ప్రచురితమైంది. ఈ పరిశోధన రిపోర్టును విక్రమ సింహపురి యూనివర్శిటీకి అందజేశారు. యూనివర్శిటీ నిబంధనల మేరకు పరిశోధన పత్రం ఉండటంతో సల్ల మౌళిని డాక్టరేట్ కు ఎంపిక చేశారు. ఇవాళ యూనివర్శిటీ వైస్ – ఛాన్సలర్ సుందరవల్లి మౌళికి డాక్టరేట్ ను ప్రధానం చేశారు. నెల్లూరుజిల్లాలోని వివిధ పరిశ్రమలు, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, స్కిల్ డెవలప్ మెంట్, వాతావరణం, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై పరిశోధన పత్రాన్ని సిద్ధం చేశారు. ఇందు కోసం మౌళి ఐదేళ్లు కష్టపడ్డారు. ఎన్నో ఆటంకాలను, ఆర్ధిక ఇబ్బందులను ఎదురొడ్డి పరిశోధనను పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. యూనివర్శిటీ నుండి డాక్టరేట్ ను అందుకున్నారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ పి. రామచంద్రారెడ్డి, ఆర్.ఎన్.డి డీన్ ఆచార్య సుజా ఎస్ నాయర్, సోషల్ వర్క్ విభాగ అధిపతి డాక్టర్ ఆర్. మధుమతి, డాక్టర్ కె. సునీత, సహాయక పరీక్షల నియంత్రణ అధికారి శ్రీకన్య రావు తదితరులు పాల్గొన్నారు. ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చిన మౌళి విద్యార్ధి సమస్యలపై పోరాటం సాగిస్తూనే… డాక్టరేట్ ను సాధించడం ఇతర విద్యార్ధులకు ఆదర్శం. మౌళిని ప్రతీ ఒక్క విద్యార్ధి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read Previous

శభాష్ కోటన్న : మలిరెడ్డి కోటారెడ్డికి సిఎం జగన్ ప్రశంసలు

Read Next

టిడిపిలోకి కొనసాగుతున్న చేరికలు : ఆహ్వానిస్తున్న కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.