Clock Of Nellore ( Nellore ) – కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కోవూరు నియోజకవర్గ టిడిపి నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులోని ప్రశాంతి రెడ్డిని నివాసానికి నేతలు భారీ ఎత్తున చేరుకుని బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంతి రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అలాగే నెల్లూరు ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు.

Tags: 2024 AP Assembly Elections Kovur TDp Kovur TDP Assembly Cadidate Vemireddy Prasanthi Reddy VPR Canvention Centre