Clock Of Nellore ( Nellore ) – రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటూ నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు కూడా టిడిపి కండువా కప్పుకున్నారు. నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యి వేమిరెడ్డి దంపతులకు పసుపు కండువా వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. రూప్ కుమార్ యాదవ్ కు కూడా పసుపు కండువా వేసి టిడిపిలోకి ఆహ్వానించారు. వారితో పాటూ పలువురు కూడా టిడిపిలో చేరారు.

