నెల్లూరుజిల్లా వైసీపి అధ్యక్షునిగా ఆనం విజయకుమార్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి రాజీనామా ప్రభావం జిల్లా క్యాడర్ పై పడకుండా ఉండేందుకు పలు ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా వాసులందరికీ సుపరిచితుడైన మాజీ డిసిసిబి అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డిని వైసిపి జిల్లా అధ్యక్షునిగా నియమించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఒక వేళ ఆయన కాకపోతే ఎమ్మెల్సీ, కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం ఉంది. ఆనం విజయకుమార్ రెడ్డి సతీమణి ఆనం అరుణమ్మ ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు.

Read Previous

టిడిపిలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి : ఆయనతో పాటూ భారీగా చేరికలు

Read Next

రెండు నెలలు ఓపిక పట్టండి : వచ్చేది టిడిపి ప్రభుత్వమేనన్న పొంగూరు రమాదేవి

Leave a Reply

Your email address will not be published.