Clock Of Nellore ( Nellore ) – ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఈనెల 19వ తేదీనా నెల్లూరులో శోభాయాత్రను నిర్వహించనున్నట్లు ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటి అధ్యక్షులు కాకు మురళి రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత దేశ శౌర్యాన్ని, పరాక్రమాన్ని విశ్వవ్యాప్తంగా చాటిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను నెల్లూరులో నిర్వహిస్తున్నామని చెప్పారు. భావి తరాలకు పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని పెంపొందించే సదాశయంతో గత ఐదేళ్లుగా నెల్లూరులో శివాజీ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా నగరంలోని విఆర్సీ సెంటర్ నుండి గాంధీబొమ్మ, శివాజీ సెంటర్, ఏసి సెంటర్, కనకమహాల్, కొత్త హాలు, సండే మార్కెట్ మీదుగా విఆర్సీ మైదానం వరకూ శివాజీ శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శోభాయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కాకు మురళి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటి ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, ఉపాధ్యక్షులు మహేష్, అమర్ రెడ్డి పాల్గొన్నారు.