కిన్నెర బాటలో పలువురు కార్పొరేటర్లు : నారాయణతో రహస్య మంతనాలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 7వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనుచరులతో కలిసి మాజీ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో వారందరికీ పార్టీ కండువాలు వేసిన చంద్రబాబు టిడిపిలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పదికి పది సీట్లు టిడిపి కైవసం చేసుకునేలా పనిచేయాలన్నారు. నెల్లూరు సిటీ నుండి నారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరో వైపు అనీల్ కుమార్ యాదవ్ ను నరసారావుపేట ఎంపి అభ్యర్ధిగా పంపడంతో వైసీపి కేడర్ లో అయోమయం నెలకొంది. తెలుగుదేశం పార్టీలో చేరడమే మేలనే అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. నిన్న 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి టిడిపి చేరారు. కార్పొరేషన్ కో – ఆప్షన్ సభ్యులు చాట్ల నరసింహారావు రేపోమాపో నారాయణ సమక్షంలో టిడిపిలో చేరనున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంభందించి వైసిపిలోని అనేక మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. రెండు మూడు రోజుల్లో వారంతా టిడిపిలో చేరే అవకాశం ఉంది. కీలక నేతలు కూడా టిడిపిలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది.

Read Previous

కలిసికట్టుగా పనిచేసి గెలుద్ధాం… నేతల సమావేశంలో ఖలీల్ వెల్లడి

Read Next

మనస్ఫూర్తిగానే నరసారావుపేట వెళ్తున్న : నెల్లూరుకు వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే అనీల్

Leave a Reply

Your email address will not be published.