Clock Of Nellore ( Tada ) – ఏపిలో ఎన్నికల దృష్ఠ్యా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుపతి జిల్లా తడ ఉమ్మడి చెక్ పోస్టు వద్ద ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటూ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం తెల్లవారు జామున ఓ కారును తనిఖీ చేయగా అందులో 9 లీటర్ల విదేశీ మద్యం లభ్యమైంది. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రసాద్, రవికిషోర్, సురేష్, వెంకట్రావ్ అనే నలుగురు చెన్నై ఎయిర్ పోర్టులోని డ్యూటీ ఫ్రీ కౌంటర్ లో విదేశీ మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. తడ ఎస్సై శ్రీనివాసులు, సెబ్ పోలీసులు కారును తనిఖీ చేసి మద్యం కొనుగోలుకు సంభందించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.