Clock Of Nellore ( Amaravathi ) – ఏపిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ పార్టీల కూటమిలో బిజేపి కలిసే అవకాశం లేదని అందరూ అనుకుంటున్న ఊహాగానాలకు టిడిపి అధినేత చంద్రబాబు తెరదించారు. బిజేపిని కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. బిజేపి పెద్దలను కలవనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర పెద్దలతో విడివిడిగా సమావేశం కానున్న చంద్రబాబు పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. టిడిపి – జనసేన మధ్య ఇప్పటికే పొత్తు కుదిరిన నేపద్యంలో ఆ పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చాయి. ఏ పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేయాలో అనేది మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల కూటమిలో బిజేపి కూడా కలుస్తుందని పక్కా సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ఠ్యా టిడిపితో పొత్తు మేలని బిజేపి రాష్ట్ర నేతలు ఇప్పటికే కేంద్ర పెద్దలకు స్పష్టమైన సంకేతాలు పంపారు. ఈ నేపద్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉత్కంఠంగా మారింది.