నెల రోజుల్లోగా EVM ల తనిఖీ పూర్తి చేయండి : అధికారులకు కలెక్టర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – ఎన్నికల కమిషన్ నిర్ణయించిన గడువులోగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తనిఖీ పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న ఓటింగ్ యంత్రాల గోడౌన్లో ఈవీఎంల పర్యవేక్షణ అధికారి, బెల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవీఎంల తనిఖీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో వినియోగించే ఈవీఎంలు తనిఖీ పకడ్బందీగా, జాగ్రత్తగా చేయాలని సూచించారు. వచ్చే నెల 10వ తేదీలోగా ఈవీఎంల తనిఖీ పూర్తి చేయాలన్నారు. ఈవీఎం మిషన్లో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని వేరుగా భద్రపరచాలని సూచించారు. ఏ అధికారి సెల్ ఫోన్ తో ఈ వి ఎం గోడౌన్ లోకి ప్రవేశించ కూడదనే నిబంధన వుండటంతో ముందుగా ఆయన తన సెల్ ఫోనును ఏర్పాటు చేసిన కౌంటర్ లో అప్పగించి, రిజిస్టర్ లో సంతకం చేసి, తనిఖీ అనంతరం ఈవీఎం గోడౌన్ లోనికి వెళ్లారు. గోడౌన్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మొదటి స్థాయి తనిఖీలో డిఆర్ఓ యస్ .లవన్న, ఆర్డీవో మాలోల, ఈవీఎం ల సూపర్వైజర్ సుధాకర్ రావు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరు DRO గా బాధ్యతలు స్వీకరించిన లవన్న

Read Next

ఘనంగా ఆదాల జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నేతలు

Leave a Reply

Your email address will not be published.